నమో తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే।
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని॥
మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, తులసి కేవలం ఒక మొక్క కాదు; అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం.
"యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః। యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్॥"
తాత్పర్యం: తులసి వేరునందు సకల తీర్థములు, మధ్యలో సకల దేవతలు, అగ్రమున సకల వేదములు కొలువై ఉంటాయి. శ్రీమన్నారాయణుడు 'తులసీదళ ప్రియుడు'. ఆ స్వామికి చేసే నిత్యార్చనలోనూ, విశేషమైన లక్షతులసీ దళార్చనలోనూ తులసి లేనిదే పూజ సంపూర్ణం కాదు.
"తులసీ కాననం యత్ర తత్ర సన్నిహితో హరిః" - ఎక్కడైతే తులసి వనం ఉంటుందో, అక్కడ శ్రీహరి నివాసం ఉంటాడు. తులసి వనమునకు ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు భూప్రదక్షిణతో సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. భక్తుల సౌకర్యార్థం ఈ బృందావనంలో విశాలమైన ప్రదక్షిణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాము. తులసి వనంలో సంచరించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు, పవిత్రమైన గాలి వల్ల ఆరోగ్య సిద్ధి కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి.

సుమారు 23 సంవత్సరాల క్రితం, మల్లాది క్షేత్రంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన "లక్ష తులసీదళార్చన" సేవను నిర్వహించాలని సంకల్పం జరిగింది.
ఈ తులసి వనం మధ్యలో భక్తుల సహకారంతో శ్రీకృష్ణ పరమాత్ముని దేవాలయం నిర్మించబడింది.
గత 40 సంవత్సరాలుగా ఆర్యవైశ్య ప్రముఖులు కీ.శే. యేలూరి పార్థసారధి గారు ఈ ఆలయ పురోగతికి అహర్నిశలు కృషి చేశారు. నేడు వారి ధర్మపత్ని యేలూరి మంగాయమ్మ గారు మరియు వారి కుమారులు అదే దీక్షతో ఈ బృందావన మరియు కృష్ణ మందిర పనులను పర్యవేక్షిస్తున్నారు.