స్వయంభు వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామివారు

Latest News

photo
  • 31 December, 2023

“ప్రపంచంలో అరుదైన, అత్యంత విశిష్ఠమైన, మరకతము (పచ్చ-ఎమరాల్డ్) తో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మరియు సవర్ణ, సపత్ని, సవాహనపూర్వక నవగ్రహదేవాలయ దర్శనం సకలపాప వినాశనం- హామంగళప్రదం"

“భగవతి శ్రీలలితాపరమేశ్వరీదేవి" స్వప్న సాక్షాత్కార ఆదేశానుసారము, దేవి ఉపాసకులు, లలాటరేఖా శాస్త్ర నిపుణులు

బ్ర: శ్రీ: డా: మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారిచే నిర్మించబడిన ఆలయములో పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి వారి కరకమలములచే మరకత శ్రీ లక్ష్మీ గణపతి మరియు సవర్ణ, సపత్ని, సవాహనపూర్వక నవగ్రహ విగ్రహములను చైత్ర బ: పంచమి 27-4-2016 వ సం:లో అంగరంగ వైభవంగా,  నేత్రపర్వముగా ప్రతిష్టించబడి, భారతదేశంలో మహామహిమాన్విత గణపతి క్షేత్రములలో ఒకటిగా విరాజిల్లుచున్నది.

పూజా కార్యక్రమములు వివరములు

సమయము

సేవలు

ఫలితము

ఉ: 4:00గం: లకు

సుప్రభాతసేవ

ఆరోగ్యము, యశస్సు

బుధ, ఆదివారము సంకట హర చతుర్థి

ఉ: 4:30 గం: లకు

ఉ: 5:00 గం: లకు

మరకత శ్రీ లక్ష్మీ గణపతి వస్త్రాలంకరణ సేవ

దైవానుగ్రహం, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి, కీర్తి ప్రతిష్ఠలు, వ్యాపారాభివృద్ధి, మనఃశాంతి

32 ఔషదీకృత ద్రవ్యాదులతో విశేష-

అభిషేకము రాజోపచార పూజలు

ధనప్రాప్తి, ఆరోగ్య, సర్వాభీష్ఠ, సర్వకార్యసిద్ధి

హోమాలు

బుధ, ఆదివారము,

సంకట హర చతుర్థి

ఉ: 8:00 గం: లకు

మోదకములు, తేనె, మల్లె, తామర పువ్వులతో గణపత్యదర్వణ శీర్షిపనిషత్, లక్ష్మీ గణపతి మూలమంత్రము, సంపుటిత శ్రీ దుర్గ, శ్రీ సూక్త పూర్వక మరకత శ్రీ మహాలక్ష్మీ హోమం

విద్య, విదేశీయాన, ఉద్యోగ, వివాహ, సంతాన, ఐశ్వర్యప్రాప్తి

శుక్రవారము

ఉ: 10:00 గం: లకు

ఉ: 11:30 గం:లకు

సువర్ణ పుష్పార్చన

పూర్వజన్న పాప నివృత్తి, లక్ష్మీ కటాక్షం

మరకత శ్రీ లక్ష్మీ గణపతి

ఒడిగంటి సేవ

అష్టలక్ష్ముల అనుగ్రహం, సౌభాగ్య ప్రాప్తి

శనివారం

ఉ: 5.00 గం: లకు

నవగ్రహ అభిషేకములు, పంచామృతాభిషేకం,

శనికి తైలాభిషేకం, నవగ్రహ హోమాలు

రాహు, కాల సర్ప, కుజ, నవగ్రహ దోషాల నివారణ

దర్బారు సేవ బుధ, శుక్ర, ఆదివారం, సంకట హర చతుర్థి

రాజోపచార పూజల అనంతరం అన్న ప్రసాద దాతలకు వేద ఆశీర్వచనం

ఆర్థిక అనారోగ్య, గృహ, వాస్తు, నరదృష్టి, నవగ్రహ దోషాల నివారణ

  • 8 January, 2024

ఒక్కొక్క మన్వంతరములో, కల్పములో, యుగములో దుష్టశక్తులు విజృంభించిన సమయములో, ఆదిప్రణవరూపుడు, పరబ్రహ్మ స్వరూపమైన మహాగణపతి యొక్క స్త్రీరూపమే శ్రీదేవిగా, ఆమెయే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అవతరించి మధుకైటభులను, మహిషాసురున్ని, శుంభనిశుంభులను, చండముండులను, దుర్గమాసురున్ని, డోలాసురున్ని సంహరించినట్లు దేవిభాగవతములో శక్తి స్వరూపిణి భగవతి ఆదిపరాశక్తి తన యొక్క మహామహిమను బహిర్గతపరచి సమస్త లోకాలకు శాంతిని చేకూర్చినదని చెప్పబడింది.

దేవి  నవరాత్రులు  గురువారం  3rd అక్టోబర్  2024 నుండి  12th October 2024 వరకు జరుగును.

శుద్ధ సత్వస్వరూపిణియై, సర్వసంపదలకు అధిష్ఠాత్రిగా, సర్వసస్యాత్మికగా, భూతకోటికి జీవనోపాయ రూపిణిగా, సర్వమంగళ కారిణిగా, ఐశ్వర్యప్రదాయినిగా ఉన్న అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి.

“యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్త స్యై నమస్త స్యై నమోనమః :

అనగా అన్ని జీవులలో ఉండే లక్ష్మీస్వరూపాన్ని శరన్నవరాత్రులలో ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, గజలక్ష్మీ, సంతానలక్ష్మి, విజయలక్ష్మీ, విద్యాలక్ష్మీ, ధనలక్ష్మీ, మరకత శ్రీలక్ష్మీ, రూపాలుగా ఆరాధించడం వల్ల అప్టైశ్వర్య, ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. శతృపీడ తొలగి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది.

సత్కర్మలు, శుచీ, శుభ్రత, సదాచారం ఉన్న ఇంట కొలువై ఇహపరాలను అందిస్తూ, ఆనందం, సంతోషం, సుఖం, శాంతి, సౌఖ్యాలను కలుగజేస్తూ సృష్టిలోని సమస్త సంపదలను అనుగ్రహించే తల్లిని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరిగే దేవి శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారములో దేదీప్యమానముగా దర్శనమిచ్చే "మరకత శ్రీ మహాలక్ష్మీ దేవిని" దర్శించి పూజించి, నైవేద్యాలను సమర్పించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం.

  • 8 January, 2024

ఆది ప్రణవ స్వరూపుడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై, ఈ జగమంతా వ్యాపించిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రతీ సంవత్సరం చైత్ర బ||  పాడ్యమి నుండి పంచమి వరకు అంగరంగ వైభవంగా, నేత్ర పర్వముగా ఆధ్యాత్మిక శోభతో భక్తి పూర్వకముగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయు అశేష భక్తజన వాహినికి ఇదే మా ఆహ్వానము.

మరకత  శ్రీలక్ష్మి గణపతి దేవస్థానము, కానాజిగూడ , సికింద్రాబాదు. మరకత  శ్రీలక్ష్మి గణపతి ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలు 26 -04-2024  నుండి 28 -04-2024  వరకు జరుగును.

బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాన్ని ఇచ్చే లక్ష్మీగణపతి స్వామిని, ధనం, విద్య, వివాహ, ఆరోగ్య, వ్యాపార, యశో, శ్రేయ కారకుడైన బుధ గ్రహ రత్నమై ప్రపంచంలో అరుదైన, అద్భుతమైన మరకతమణి (పచ్చ-ఎంరాల్డ్) శిలతో మలచిన స్వామి దర్శనంతో నేత్ర, జీర్ణ, నరాల, వాత, కఫ, అశాంతి, ఒత్తిడి, కోర్టు, ఋణ, అకాల వైర దోషాలు తొలుగుతాయి.

ఆలయంలోని సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి రధోత్సవ, బ్రహ్మోత్సవ, హోమ కార్యక్రమాలలో పాల్గొనే భక్తులకు మరియు ఆశ్లేషా, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు, వృషభ, మిధున, కన్యా, వృశ్చిక, మీనరాశుల వారు 5,7,14,16,23,25 తేదీలలో జన్మించిన వారందరూ స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొనిన నవగ్రహ దోషాలు, కలి దోషాలు నివారించబడి మాయా మోహాలు తొలిగి జ్ఞాన బీజాలు అంకురించి అభీష్ట సిద్ధి, ధనదాన్య సమృద్ధి ఆటంకాలు తొలిగి సకల శ్రేయస్సులు కలుగుతాయి.

బ్రహ్మోత్సవాలలో భక్తులచే స్వయంగా లక్ష్మీ గణపతి , లక్ష్మీ కుబేర , లక్ష్మీ నారసింహ, సుదర్శన , మన్యుసూక్త హోమాలు, త్రిచ అరుణ,మహాసౌరయాగాలు , సరస్వతి , వేదాసూక్త , శ్రద్ధసూక్త హోమాలు, సుబ్రహ్మణేశ్వర, రుద్ర, చండీ హోమాలు చేయించబడును. చివరి రోజున మహాలింగార్చన, మహాపూర్ణాహుతి , శాంతికళ్యాణం నిర్వహించబడును.

  • 1 February, 2024

“న కార్తీక సమో మాసో నకృతేన సమం యుగమ్

నవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమః "

సూర్యుడు తులారాశియందు, చంద్రుడు కృత్తికా నక్షత్రములో కూడియున్న కార్తీక మాసములో హరిహరులను మోదముగా , స్నాన , దాన, జప, దీపారాధన, అన్నదానాదులు చేయడం వలన సర్వదుఃఖ విముక్తులై ఇహంలో సర్వసుఖాలను అనుభవించి  అంత్యాన మోక్ష ప్రాప్తి కలుగుతుందని పద్మ, స్కాంద పురాణాలు కార్తీక మాస మహత్తును తెలుపుతున్నాయి.

కార్తీక మాస పూజలు - ఫలితములు

తేదీ/సమయము

ఆర్జిత సేవలు

ఫలితము

దీపావళి:

ఉ: 8:30 గం: లకు

లక్ష్మీగణపతి, లక్ష్మీ కుబేర హోమాలు

ఆర్థిక, ఋణ బాధల నివృత్తి, లక్ష్మీ కటాక్ష సిద్ధి, వ్యాపారాభివృద్ధి

ప్రతి సోమవారం ఉ: 5:00గం:లకు నుండి

పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య అర్చిత గురు పరంపరాగత మహాస్పటిక శివలింగాలకి భక్తులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి

అపమృత్యు, నవగ్రహ దోషాల నివారణ, విద్య, వివాహ, కీర్తి, ఆయురారోగ్య, ఐశ్వర్య, సౌభాగ్య, సత్సంతాన, అధికార ప్రాప్తి, మనఃశాంతి

కార్టక పౌర్ణమి

ఉ: 4:00 గం:లకు

ఉ: 8:00 గం:లకు

రమా సహిత శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం

ఆయురారోగ్య, ఐశ్వర్య, విద్య, వివాహ, సంతాన ప్రాప్తి, అభీష్ఠసిద్ధి, స్థిర లక్ష్మీ కటాక్షం, మనఃశాంతి

  • 1 February, 2024

ముద్గల పురాణంలో కణ్వమహర్షి, భరతుడికి భాద్రపద శు: చవితి గణపతి వ్రత మహిమ, పూజానియమాల గురించి, మట్టిగణపతి ఆవశ్యకత, ఏకవింశతి పత్రార్చన గురించి చెప్పినట్లు స్పష్టముగా ఉన్నది. 

గణేష్  నవరాత్రి   2024  లో   7త్ సెప్టెంబర్ 2024 నుండి  17త్ సెప్టెంబర్ 2024  వరకు జరుగును 

జడపదార్దమైన భూమికి చైతన్యం కల నీళ్ళతో చేరినపుడు భూమి ఆహారపదార్ధాలను, ఔషదులను అందిస్తుంది. అంటే ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా భూతత్వానికి అధిష్ఠాన దేవత మరియు మూలధార చక్రానికి అధిదేవతయైన గణపతిని పూజిస్తారు. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నుండి త్రయోదశి వరకు 11 రోజుల పాటు అంగరంగవైభవంగా,  నేత్రపర్వముగా, భుక్తి, ముక్తి , ఫలదాయకముగా నిర్వహించబడును .

 మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవములో స్వామి వారు ఒక్కక్కరోజు ఒక్కొక అవతారములో దర్శనమిస్తారు. స్వామి వారు వరసిద్ధి , మహా గణపతి, వికట, లంభోదర, గజానన,మహోధర, ఏకదంత, వక్రతుండ, విఘ్నరాజ, దూమ్రవర్ణ, చివరి రోజున మరకత శ్రీలక్ష్మీ గణపతిగా దర్శనమిస్తారు.

అభిషేక, హోమాదుల తరువాత ఏకవింశతి దివ్యపత్రములలో దివ్యపత్రార్చన జరిపి తదనంతరం  మహానీరాజనాలు, తీర్థప్రసాద వితరణ జరుగుతాయి.

ఏకవింశతి దివ్యపత్రములతో గణపతి సహస్రనామార్చన

అవతారము

దివ్యపత్రములు

పూజా ఫలితము

నైవేద్యాలు

వరసిద్ధి గణపతి

ఏకవింశతి పత్రపూజ

సర్వకార్య సిద్ధి, సర్వాభీష్ఠసిద్ధి,ఆరోగ్య సిద్ధి

ఉండ్రాళ్ళు

మహా గణపతి

శమీపత్రం (జమ్మి)

జాజి పత్రం

నవగ్రహ, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, శ్వాస, చర్మ, దంత, పక్షవాత నివారణ

బాదుషాలు

వికట గణపతి

అర్కపత్రం (జిల్లేడు) చూతపత్రం (మామిడి)

ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలు, ముక్కు, గొంతు, బి.పి., గుండె జబ్బుల నివారణ

అటుకులు లడ్డూలు

లంబోదరుడు

మాచీపత్రము (దవనం)

బిళ్వదళం (మారేడు)

నవగ్రహ, అప్పుల బాధలు నివృత్తి, కంటి, కామెర్లు, షుగర్, కీళ్ళ వ్యాధులు నివారణ

మైసూర్పాక్

గజాననుడు

అర్జున పత్రం (మద్ది)

 బృహతీపత్రం (వాకుడాకు)

ఆరోగ్యసిద్ధి, సంతానప్రాప్తి, గుండె, ఆస్తమా, లీవర్ సమస్యల నివారణ

రవ్వకేసరి

మహోధరుడు

అపామార్గపత్రం (ఉత్తరేణి)

బదరీపత్రం (రేగు

మానసిక, ఆరోగ్య, వ్యాపార, సంతాన సమస్యలు, నిద్రలేమి, దంత, చర్మ, నరాల బలహీనత నివారణ

మినపవడలు

ఏకదంతుడు

గండకీపత్రం

దత్తూరపత్రం (ఉమ్మెత్త)

సర్వకార్యసిద్ధి, మాససిక, విద్య సమస్యలు కీళ్ళు, లైంగిక వ్యాధుల నివారణ

కొబ్బరి లడ్డూలు

వక్రతుండుడు

సింధువార పత్రం (వావిలి)

విష్ణుక్రాంత పత్రం (అవిసె)

సర్వకార్య జయం, విద్య, మానసిక సమస్యలు, షుగర్, కంటి, అజీర్ణ నవరత్న లడ్డూలు సమస్యలు, నవగ్రహ దోశ నివారణ

నవరత్న లడ్డులు

విఘ్నరాజు

మరువకపత్రం దాడిమిపత్రం (దానిమ్మ)

సర్వకార్యసిద్ధి, వివాహం, అన్యోన్య దాంపత్యం, ఉద్యోగాల్లొ ఉన్నతస్థానం, ఆరోగ్య సమస్యలు

నేతి అప్పాలు

ధూమ్రవర్ణుడు

అశ్వత్థ పత్రం (రావి) కరవీరపత్రం (గన్నేరు)

ఉన్నతస్థానం, ఆరోగ్య సమస్యలు విద్య, సంతానప్రాప్తి, ఆరోగ్యసిద్ధి

మోదకాలు

మరకత శ్రీ లక్ష్మీ గణపతి

దేవదారు పుష్పాలు గరిక

సర్వకార్య, సర్వాభీష్ఠసిద్ధి, సంతాన సమస్యలు, కిడ్నీ సమస్యల నివారణ

ఉండ్రాళ్ళు

మొక్కజొన్న గారెలు

గమనిక: 11 రోజులు వరుసగా అభిషేక, హవన, ఏకవింశతి పత్రార్చనలో పాల్గొనిన వారికి మరకత గణపతి లాకెట్ మరియు లక్ష్మీ గణపతి యంత్ర సహిత వెండి డాలర్ మహాప్రసాదంగా ఇవ్వబడును.