“న కార్తీక సమో మాసో నకృతేన సమం యుగమ్
నవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమః "
సూర్యుడు తులారాశియందు, చంద్రుడు కృత్తికా నక్షత్రములో కూడియున్న కార్తీక మాసములో హరిహరులను మోదముగా , స్నాన , దాన, జప, దీపారాధన, అన్నదానాదులు చేయడం వలన సర్వదుఃఖ విముక్తులై ఇహంలో సర్వసుఖాలను అనుభవించి అంత్యాన మోక్ష ప్రాప్తి కలుగుతుందని పద్మ, స్కాంద పురాణాలు కార్తీక మాస మహత్తును తెలుపుతున్నాయి.
కార్తీక మాస పూజలు - ఫలితములు
తేదీ/సమయము |
ఆర్జిత సేవలు |
ఫలితము |
దీపావళి: ఉ: 8:30 గం: లకు |
లక్ష్మీగణపతి, లక్ష్మీ కుబేర హోమాలు |
ఆర్థిక, ఋణ బాధల నివృత్తి, లక్ష్మీ కటాక్ష సిద్ధి, వ్యాపారాభివృద్ధి |
ప్రతి సోమవారం ఉ: 5:00గం:లకు నుండి |
పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య అర్చిత గురు పరంపరాగత మహాస్పటిక శివలింగాలకి భక్తులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి |
అపమృత్యు, నవగ్రహ దోషాల నివారణ, విద్య, వివాహ, కీర్తి, ఆయురారోగ్య, ఐశ్వర్య, సౌభాగ్య, సత్సంతాన, అధికార ప్రాప్తి, మనఃశాంతి |
కార్టక పౌర్ణమి ఉ: 4:00 గం:లకు ఉ: 8:00 గం:లకు |
రమా సహిత శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం |
ఆయురారోగ్య, ఐశ్వర్య, విద్య, వివాహ, సంతాన ప్రాప్తి, అభీష్ఠసిద్ధి, స్థిర లక్ష్మీ కటాక్షం, మనఃశాంతి |