మల్లాది క్షేత్ర హోమ మహోత్సవ విశేషాలు ॥
"అగ్నిర్వై దేవానాం ముఖమ్" - అగ్ని దేవుడు దేవతలందరికీ ముఖము వంటివాడు. సనాతన హిందూ ధర్మం ప్రకారం, పంచభూతాలలో ఒకటైన అగ్ని అత్యంత పవిత్రమైనది. అగ్ని హోత్రం ద్వారా మనం సమర్పించే ద్రవ్యాలను అగ్నిదేవుడు శుద్ధి చేసి దేవతలకు అందజేస్తాడు. సంస్కృతంలో అగ్నిని 'పావక' అని అంటారు, అనగా దేనినైనా శుద్ధి చేయగలిగిన శక్తి కలది అని అర్థం.
మల్లాది పుణ్యక్షేత్రంలో, వటవృక్ష స్వరూపుడైన ఆ శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించే హోమాలు భక్తులకు అద్భుతమైన తేజస్సును, గ్రహశాంతులను మరియు లోక కళ్యాణాన్ని చేకూరుస్తాయి.
మల్లాది వటవృక్షాంతర్గత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ క్రింది విధంగా హోమాలు నిర్వహించబడతాయి:
శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం : 2026 ఏప్రిల్ 19 (వైశాఖ మాసం) నుండి ప్రారంభమై ప్రతి ఆదివారం 52 వారాల పాటు నిరంతరాయంగా జరుగును.
ప్రత్యేక హోమాలు : వినాయక చవితి నాడు గణపతి హోమం, మహర్నవమి (దసరా) నాడు చండీ హోమం, కార్తీక సోమవారం నాడు రుద్ర హోమం నిర్వహించబడును.
గోత్రనామ పూజలు : హోమంలో పాల్గొనలేని భక్తుల తరపున దేవస్థాన అర్చకులు వారి గోత్రనామాలతో పూజలు చేసి, 4 నెలలకు ఒకసారి (మొత్తం 3 సార్లు) హోమ భస్మం మరియు పవిత్ర కంకణాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు.
"సుదర్శన చక్రరాజాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్"
ఏ దారీ తోచనప్పుడు ఈ హోమం చేయడం వలన సరైన మార్గం లభిస్తుంది. దీని ఫలితాలు అనంతం:
శత్రు బాధల నుండి విముక్తి, భూత ప్రేత పిశాచ బాధల నివారణ మరియు ప్రయోగాల నుండి రక్షణ లభిస్తుంది.
ఉద్యోగ సమస్యల నుండి ఉపశమనం, అష్టైశ్వర్య సిద్ధి, ధనధాన్య సమృద్ధి కలుగుతాయి.
అఖండ సౌభాగ్యం, ఓజస్సు మరియు తేజస్సు ప్రాప్తిస్తాయి.
ఐశ్వర్య సిద్ధికి, విదేశీ ప్రయాణ ప్రయత్నాలకు మరియు కార్య విఘ్నాలు తొలగి విజయము చేకూరడానికి ఈ హోమం అత్యంత ప్రశస్తమైనది.
పరమేశ్వరుని పూర్ణానుగ్రహం కోసం, తీవ్రమైన కష్టాలు మరియు పాపాల నుండి విముక్తి పొందేందుకు పాశుపత ప్రక్రియలో ఈ హోమం నిర్వహించబడుతుంది.
రాజకీయాలో గెలుపు, ఉద్యోగ పదోన్నతి మరియు రాహుగ్రహ పీడా పరిహారానికి చండీ హోమం మించిన మార్గం లేదు.