Spiritual Quize

  • Home
  • Spiritual Quize
photo
img
॥ ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ - క్విజ్ కార్యక్రమ ప్రశస్తి ॥

జ్ఞానమే పరమాత్మ - ధర్మ సంరక్షణ

"జ్ఞానాదేవ తు కైవల్యమ్" - జ్ఞానం వలనే మోక్షం సిద్ధిస్తుంది. మన హిందూ ధర్మం కేవలం పూజా పునస్కారాలకే పరిమితం కాదు; అది ఒక అనంతమైన విజ్ఞాన భాండాగారం. మన వేదాలు, పురాణాలు మరియు సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న మధురమైన విషయాలను భక్తులకు, ముఖ్యంగా నేటి యువతరానికి అందించాలనే సదుద్దేశంతో దేవస్థాన ధర్మకర్తలు ఈ "ఆధ్యాత్మిక క్విజ్" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కార్యక్రమ విధానం - ధర్మ జిజ్ఞాస

ప్రతి శనివారం స్వామివారి సన్నిధిలో ఈ జ్ఞాన యజ్ఞం కొనసాగుతుంది. ఇందులో భాగంగా:

  • ప్రశ్నావళి :మన దేవీ దేవతల చరిత్ర, హిందూ పురాణాలు, వేదోక్తాంశాలు మరియు భారతీయ సంస్కృతి-సంప్రదాయాలకు సంబంధించి ఐదు (5) ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది.
  • భక్తుల భాగస్వామ్యం : ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఒక పత్రంపై రాసి, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'క్విజ్ బాక్స్' నందు ఉంచవలెను.
  • బహుమతి ప్రధానం : లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయబడిన ఐదుగురు విజేతలకు దేవస్థానం వారు స్వామివారి ప్రసాదంతో పాటు విశేష బహుమతులను అందజేస్తారు.
img
🟡 Next Week Quiz – Questions
1. భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరు ఏమిటి?
 
2. భగవద్గీతలో చివరి అధ్యాయం పేరు ఏమిటి?
 
3. అర్జునుడికి యుద్ధం చేయడానికి ఎందుకు సంకోచం కలిగింది?
 
4. భీష్ముడి తండ్రి ఎవరు?
 
5. కౌరవుల మేనమామ ఎవరు?
 
🔴 Last Week Quiz – Questions
1. గీతలో ప్రధానంగా చెప్పబడిన యోగాలు ఏవి?
Answer: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం
2. ఆత్మ స్వభావం ఏమిటి?
Answer: నిత్యమైనది, శాశ్వతమైనది
3. గీత ప్రధాన బోధ ఏమిటి
Answer: ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయాలి
4. గీత చివరికి అర్జునుడిలో వచ్చిన మార్పు ఏమిటి?
Answer: మోహం తొలగి, కర్తవ్యాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు
5. అర్జునుడికి విశ్వరూప దర్శనం ఎలా లభించింది?
Answer: కృష్ణుని దివ్యకృప మరియు దివ్యచక్షువుల ద్వారా

ఈ కార్యక్రమ విశిష్టత - విశ్లేషణ

ఈ క్విజ్ కార్యక్రమం కేవలం పోటీ మాత్రమే కాదు, అది ఒక 'ధర్మ ప్రబోధం':

భక్తులకు విన్నపం

ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, ధర్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నాము. మన సంస్కృతిని మనం తెలుసుకోవడం అంటే మన మూలాలను మనం గౌరవించుకోవడమే.

"శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్" - శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది. రండి! స్వామివారి సన్నిధిలో విజ్ఞానాన్ని పొందుదాం.